Telangana
జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం.. నార్సింగి పోలీసుల పిటిషన్..!

టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి.. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జానీ మాస్టర్‌ను చంచల్ గూడా జైలుకు తరలించారు. అయితే.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన సంచలన విషయాలను పేర్కొన్నారు. అయితే.. కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉండటంతో.. పోలీసులు తీవ్రంగా గాలించి.. చివరికి గోవాలో అరెస్ట్ చేసి.. హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. జానీ మాస్టర్‌ను విచారించే సమయం దొరకకపోవటంతో.. పోలీసులు కస్టడీకి కోరుతున్నారు.
ఈ క్రమంలోనే.. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నార్సింగి పోలీసులు సోమవారం (సెప్టెంబర్ 23న) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. వారం రోజుల పాటు జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు కావటంతో.. ఆ కేసును రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. ఇదే సమయంలో.. బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అయితే.. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మాలాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. లైంగిక వేధింపులు, పోక్సో్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో.. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం దృష్ట్యా.. రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు.