Entertainment
Bigg Boss: బిగ్ బాస్‌లోకి నమ్రతా సిస్టర్..

Bigg Boss: బిగ్ బాస్‌లోకి నమ్రతా సిస్టర్.. హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్
Bigg Boss: బిగ్‌బాస్ రియాలిటీ షోస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందించడంలో ఈ రియాలిటీ షోస్ ముందుంటాయి. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ షోస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.
బుల్లితెర ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందించడంలో ఈ రియాలిటీ షోస్ ముందుంటాయి. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ షోస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా త్వరలో హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖానే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ హిందీ కొత్త సీజన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. అలాగే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఓ కొలిక్కివచ్చిందని సమాచారం.
కాగా బిగ్ బాస్ హిందీ సీజన్ 18 లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప్రముఖ నటి శిల్ప శిరోద్కర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు సోదరి. నమ్రతా లాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది శిల్ప. భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మోహన్ బాబు సరసన బ్రహ్మ అనే సినిమాలో కథానాయికగా నటించింది.