National
వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్!

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్‌తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.
Continue Reading