Latest Updates
దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

TG: దసరా స్పెషల్ బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.
Continue Reading