Tech
iPhone 16 India sale: ఇండియాలో నేటి నుంచి ఐఫోన్ 16 సేల్స్..

యాపిల్ లవర్స్‌కి అప్డేట్! ఇండియాలో శుక్రవారం ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభంకానున్నాయి. పలు ఎగ్జైటింగ్ ఆఫర్స్‌తో మీరు కొత్త ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ని కొనుగోలు చేసుకోవచ్చు..
యాపిల్ ఐఫోన్ 16 సేల్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్! ఇండియాలో సెప్టెంబర్ 20 నుంచి ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం కానున్నాయి. సేల్స్ వివరాలతో పాటు ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో ఐఫోన్ 16 సేల్స్..
యాపిల్ గ్లోటైమ్ ఈవెంట్ 2024లో లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ప్లస్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్ ఐఫోన్ 16.
ఐఫోన్ 16 కోసం ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 13నే ప్రారంభమయ్యాయి. మోడల్స్ డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతాయి. మీరు మీ ఐఫోన్ 16 ను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతే, అవైలబులిటీని చెక్ చేసిన తర్వాత మీరు ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 ధర..
యాపిల్ కొత్త ఐఫోన్ 16 ధరను దాని మునుపటి ఐఫోన్ 15 మాదిరిగానే ఉంచింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 ధర రూ.79,900గా ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.89,900, రూ.10,99,900గా ఉన్నాయి. అల్ట్రా మెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో కొత్త ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.