International
నేపాల్ రాజ్యాంగ సవరణ డిమాండ్‌తో జెన్-Z నిరసనలు
నేపాల్‌లో జెన్-Z యువత ఆధ్వర్యంలో నిరసనలు మరింత ఉధృతం అవుతున్నాయి. దేశ భవిష్యత్తు కోసం కొత్త దిశలో అడుగులు వేయాలని వారు స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా వీరు రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా జరుగుతోన్న అవినీతి, దోపిడీపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.
నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా గుర్తించాలని, వారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలనే డిమాండ్ కూడా నిరసనకారులు చేస్తున్నారు. ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, దేశానికి శాంతి, స్థిరత్వం తీసుకురావడానికే అని స్పష్టంచేస్తున్నారు. యువత సమాజంలో మార్పు తెచ్చే శక్తిగా ముందుకు వస్తోంది.
నిరసనకారుల ప్రకారం, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో విఫలమైందని వారు భావిస్తున్నారు. అందుకే కొత్త రాజకీయ వ్యవస్థ ద్వారానే శాంతి, అభివృద్ధి సాధ్యమని అంటున్నారు. రాజ్యాంగ సవరణతోపాటు పారదర్శక పాలనను కోరుతూ వీరి పోరాటం కొనసాగుతోంది.