Connect with us

Health

మండి బిర్యానీలో బొద్దింక కలకలం

Cockroach Found in Biryani In Alwal Hyderabad | హైదరాబాద్‌లో ఘోరం.. బిర్యానీలో  బొద్దింకలు - YouTube

హైదరాబాద్ ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్‌కు వడ్డించిన బిర్యానీ ప్లేట్‌లో బొద్దింక కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఆహారంలో ఇలాంటి అసహ్యకర దృశ్యం చూసి కస్టమర్ ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యాడు.

బిర్యానీలో బొద్దింక ఎలా వచ్చిందని కస్టమర్ రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. సరైన వివరణ ఇవ్వకుండా కస్టమర్‌ను సముదాయించి బయటకు పంపివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ కస్టమర్, సోషల్ మీడియాలో ఈ ఘటనను బయటపెట్టాడు.

ఈ సంఘటనతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సవాల్ చేస్తున్న ఈ నిర్లక్ష్యం సహించరాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *