Entertainment
మెగా కపుల్ కి శుభవార్త
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్త బయటకు రాగానే మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్ చేస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో ఉన్నప్పటికీ, సెట్ నుండి నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వరుణ్, లావణ్యలను ఆశీర్వదించి, పసికందుకు ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నారు. చిరంజీవి హాజరుతో మెగా ఫ్యామిలీ సంతోషం మరింత రెట్టింపయింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులుగా మారడంతో మెగా అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ అంతా వారికి శుభాకాంక్షలు తెలుపుతోంది.