Andhra Pradesh
విశాఖలో కొత్త టూరిస్ట్ ఆకర్షణ.. వారంలో ఆరంభం
సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త మణి జోడించుకుంది. VMRDAతో కలిసి కలకత్తా ఆధారిత RJ సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్‌ను సుమారు ₹7 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ఇక మరికొద్ది రోజుల్లో, అంటే వారంలోపే, ఈ అద్భుతమైన స్కైవాక్ పర్యాటకుల సందర్శనకు సిద్ధం కానుంది. ఒకేసారి 50 మంది వరకు ఈ వాక్ వేపై నడవొచ్చు.
ట్రయల్ సందర్శనలో పాల్గొన్న కొందరు పర్యాటకులు తమ అనుభవాలను పంచుకుంటూ.. అలల నురగలు, తీర ఇసుక తెన్నెలు, తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, చల్లని గాలులు—all in one అనుభూతి కలిగించాయని చెప్పారు.
ఇదే విశాఖలో కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌గా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.