Andhra Pradesh
ప్రభాస్‌తో మరోసారి జోడీ కట్టేందుకు అనుష్క ఆసక్తి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరోసారి జోడీ కట్టాలని హీరోయిన్ అనుష్క శెట్టి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో బాహుబలి సిరీస్‌లో వీరిద్దరి జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరహా భారీ స్థాయి కథ వస్తే తప్పక ప్రభాస్‌తో మళ్లీ నటిస్తానని అనుష్క సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. అభిమానులూ కూడా ఈ జంటను మరోసారి తెరపై చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అనుష్క తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఘాటీ అనే సినిమా ప్రత్యేక కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుష్క భావిస్తోంది.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, బాహుబలి తర్వాత వీరిద్దరూ కలిసి నటించే అవకాశం రాకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. కానీ అనుష్క చేసిన తాజా వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కచ్చితంగా ప్రభాస్‌తో మరోసారి జోడీ కడతానని ఆమె నమ్మకంగా చెప్పిన విషయం, అభిమానులకు కొత్త ఆశలు కలిగిస్తోంది.