Connect with us

Entertainment

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ మూడో వారం ఓటింగ్..

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్‏లో ఊహించని కంటెస్టెంట్.. ఎలిమినేట్ తప్పదా?

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో మరోసారి అబ్బాయిలు ఉన్నారు. మూడో వారం ఓటింగ్ లో లెక్కలు మారుతున్నారు. ఈసారి ఇద్దరు అబ్బాయిలకు ఓటింగ్ తక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈవారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, యష్మి, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. చీఫ్ అయినప్పటికీ ఎవరో ఒకరు నామినేట్ కావాలని బిగ్‏బాస్ అదేశించగా అభయ్ నవీన్ నామినేట్ అయ్యాడు.

బిగ్‏బాస్ సీజన్ 8 విజయవంతంగా మూడో వారానికి వచ్చేసింది. హౌస్ లో నిన్నటి నుంచి ప్రభావతి 2.0 టాస్కు ఓ రేంజ్ లో జరుగుతుంది. నిఖిల్ వర్సెస్ అభయ్ టీం ఈ టాస్కులో పోటాపోటీగా ఆడుతున్నారు. కంటెస్టెంట్స్ బిహేవియర్.. ఆట తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ కోసం ప్రతి ఒక్కరు కొట్టుకున్నంత పనిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మూడో వారం ఓటింగ్ ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. రేపటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. దీంతో నామినేషన్లలో ఉన్న తమ కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తున్నారు. బిగ్‏బాస్ ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎలిమినేషన్ కు అందరూ షాకయ్యారు. గతవారం ఊహించని విధంగా శేఖర్ భాషా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

Loading