Latest Updates
యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల బారులు
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల నిల్వలు లేకపోవడంతో ఆందోళనలు చెలరేగుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొద్దిమేర స్టాక్ కోసం రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారం రావడంతో రైతులు ఉదయాన్నే అక్కడికి తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరడంతో అక్కడ రద్దీ పెరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో పోలీసులు జోక్యం చేసుకుని టోకెన్లను పంపిణీ చేశారు.
రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కోవాలా అనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.