International
ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే
ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డేని జరుపుకుంటారు. ప్రపంచ జనాభాలో సుమారు 10 నుంచి 12 శాతం మంది ఎడమచేతివారే. కుడిచేతివారితో పోలిస్తే వీరి ఆలోచనా విధానం, పనితీరులో ప్రత్యేకతలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్వతంత్ర భావాలు, సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.
వీరు ఒకేసారి అనేక పనులను సులభంగా చేయగలరు. తేలికగా ఆలోచనలు మార్చుకోగల శక్తి, షార్ప్‌నెస్, క్రియేటివిటీ, స్మార్ట్ వర్క్ వంటి లక్షణాలు వీరిలో ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గాయాలు అయినా, అనారోగ్యం వచ్చినా వీరు సాధారణంగా త్వరగా కోలుకుంటారు. స్పోర్ట్స్ రంగంలోనూ వీరిలో చాలామంది ప్రతిభ కనబరుస్తారు.
మెమొరీ పవర్ అధికంగా ఉండడం, వేగంగా ఆలోచించగలగడం లెఫ్ట్ హ్యాండర్స్ ప్రధాన బలాలు. చరిత్రలో అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఎడమచేతివారే. ఈ ప్రత్యేక దినం ద్వారా ప్రపంచం మొత్తం వీరి ప్రతిభను గుర్తించి, వారిలోని సృజనాత్మకతకు గౌరవం తెలియజేస్తోంది.