Connect with us

Latest Updates

ఆర్టీసీ బస్సుల్లో విస్తరిస్తున్న QR టికెటింగ్

TSRTC: ఇక ఆర్టీసీ బస్సుల్లోనూ నగదు రహిత టికెట్లు.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌  సిస్టం అమల్లోకి! - Telugu News | Telangana: TS RTC to introduce QR code  method for ticket purchase | TV9 Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆధునిక టికెటింగ్ సౌకర్యాలను విస్తరిస్తోంది. నగరంలో మొదట ప్రయోగాత్మకంగా ప్రారంభించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ టికెట్ విధానాన్ని ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరించింది. ఈ పద్ధతిలో ప్రయాణికులు బస్సులో ఎక్కిన తర్వాత కండక్టర్ అందించే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేసి నేరుగా టికెట్ తీసుకోవచ్చు.

ఇప్పటికే షాద్నగర్, పరిగి, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్, డీలక్స్ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. పల్లె ప్రాంతాలకు వెళ్లే బస్సులలో కూడా ఈ విధానం అందుబాటులోకి రావడంతో, డబ్బులు చేతిలో లేకపోయినా డిజిటల్ పేమెంట్ ద్వారా సులభంగా ప్రయాణం సాగించే వీలు కలుగుతోంది.

ఈ మార్పు పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగదు లావాదేవీల్లో జాప్యం తగ్గడంతో పాటు టికెటింగ్ ప్రక్రియ వేగవంతం కావడాన్ని వారు అభినందిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం త్వరలోనే మరిన్ని జిల్లాలకు ఈ క్యూఆర్ టికెటింగ్ సేవను విస్తరించాలని భావిస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *