Entertainment
RRతో సంజూ కటీఫ్!
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంజూ శాంసన్ జట్టును వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. జూన్‌లోనే ఈ నిర్ణయం గురించి ఆయన యాజమాన్యానికి తెలియజేశారని, అయితే వారు అంగీకరించలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విషయాన్ని టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పరిష్కరించాల్సిన బాధ్యత తీసుకున్నారని సమాచారం.
ద్రావిడ్ సానుకూలంగా స్పందిస్తే, సంజూను రాజస్థాన్ రాయల్స్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేయాలన్న ఆలోచన యాజమాన్యం వద్ద ఉందట. ఇది అమలు అయితే సంజూ కొత్త జట్టుతో వచ్చే సీజన్లో ఆడే అవకాశం ఉంటుంది.
ట్రేడ్ ప్రక్రియ సాధ్యం కాకపోతే, సంజూ శాంసన్ 2026 సీజన్ కోసం జరిగే ఐపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన, అనుభవజ్ఞుడైన నాయకత్వం కలిగిన ఆటగాడిగా సంజూ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.