Latest Updates
ఈవీఎం OR బ్యాలెట్.. ఏ పద్ధతి కావాలి?
ఈవీఎం vs బ్యాలెట్ పద్ధతి: మళ్లీ చర్చకు వేదిక
ఇలాంటివి గతంలోనూ జరిగింది. కానీ ఈసారి విపక్షాల ఆరోపణలతో ఈవీఎంల నమ్మకంపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత విపరీతంగా చర్చకు వచ్చిన అంశం ఇదే. అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలువురు నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ బ్యాలెట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
“ఈవీఎంలను నమ్మలేం, తిరిగి బ్యాలెట్‌కు వెళ్ళాలి” – KTR
తెలంగాణ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (KTR) కూడా ఇటీవల ఇదే వ్యాఖ్యలు చేశారు. “ఇవి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న యంత్రాలు. మళ్లీ పాత బ్యాలెట్ పద్ధతే సరైనది,” అంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే పలు విపక్ష పార్టీల నేతలు కూడా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని, కొన్ని సందర్భాల్లో అవి స్వేచ్ఛాయుతంగా పని చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.
EC, BJP ఘాటుగా ఖండన
ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రజల తీర్పుగా చెప్తోంది. మరోవైపు, ఎన్నికల కమిషన్ కూడా ఈవీఎంల పనితీరును గట్టిగా సమర్థిస్తోంది. “ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యం. నియమిత పద్ధతుల్లో సకాలంలో అన్ని పరీక్షలు నిర్వహిస్తాం” అని EC వెల్లడించింది. టెక్నాలజీ ఆధారిత ఈవీఎంలను రద్దు చేయడం అనవసరమని పేర్కొంది. కానీ ఈ పద్దతిపై నమ్మకం కలిగేలా పారదర్శకత ఉండాలన్న డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి.