Latest Updates
హైదరాబాద్‌లో భారీ వర్షం – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉరుములు, మెరుపులతో సహా కురుస్తుండగా, కొన్నిచోట్ల వరద నీరు రోడ్లపై చేరుతోంది.
మల్కాజిగిరి, ఈసీఐఎల్, ఆనంద్ బాగ్, జవహర్‌నగర్, కాప్రా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతాపూర్, మల్లాపూర్ వంటి హైదరాబాద్ ఈస్ట్ జోన్ ప్రాంతాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అలాగే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీ, షేక్‌పేట్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట తదితర సెంట్రల్ జోన్ ప్రాంతాల్లోనూ వర్షం విస్తారంగా కురుస్తోంది.
దీంతో పాటు నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, సరూర్నగర్, సైదాబాద్, అల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ వంటి ఇతర ప్రదేశాల్లోనూ భారీ వర్షం కొనసాగుతోంది.
పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగిన కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం తీవ్రత దృష్ట్యా వాహనదారులు, పాదచారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
“అత్యవసర పరిస్థితులు తప్ప బయటకి రావద్దండి” అని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.