International
యుద్ధం ఆపాలని చేతులు జోడించిన పాకిస్థాన్: ప్రధాని మోదీ
భారత దళాల ప్రతీకార దాడులతో పాక్ వెన్ను వణికిపోయిందని, యుద్ధం ఆపేయాలని మన డీజీఎంఓను పాకిస్థాన్ కలవడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వెల్లడించారు. “దయచేసి మాపై దాడులు చేయకండి, మేము ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం. ఇక తట్టుకునే శక్తి లేదు. యుద్ధం ఆపండి” అంటూ పాక్ అధికారి మన డీజీఎంఓకి కాల్ చేసి మొర పెట్టుకున్నారని ఆయన చెప్పారు.
ఇక మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ తనతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. పాక్ భారీ దాడులకు సిద్ధమవుతోందని ఆ సమయంలో హెచ్చరిక వచ్చిందని తెలిపారు. “పాక్ ఏ చర్య తీసుకున్నా, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. దాన్ని నేను తానే చూసుకుంటాను” అని తాను స్పష్టంగా చెప్పినట్లు ప్రధాని తెలిపారు.