Latest Updates
యుద్ధం ఆపలంటూ ఎవరూ చెప్పలేదు.. ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ లోక్సభలో కౌంటర్!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తానే యుద్ధం ఆపేందుకు కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ముగించమని ఏ దేశాధినేత కూడా తనను కోరలేదని లోక్సభలో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కొంతవరకూ ఖండనగా మోదీ స్పందించినట్టు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య పరిస్థితులు శాంతించాక యుద్ధం ఆపించిన ఘనత తనదే అంటూ ట్రంప్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.