News
డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు.. కొత్తగా 681 మందికి మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్లకు సామాజిక పెన్షన్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,040 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తాజాగా మరో 681 మందికి పెన్షన్ మంజూరు చేస్తూ మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేశారు. ఈ లబ్ధిదారుల్లో అత్యధికంగా 629 మంది హైదరాబాద్లో ఉన్నారు. మిగిలిన 52 మంది ఇతర జిల్లాలకు చెందినవారు. వీరందరికీ వచ్చే నెల నుంచి నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందించనున్నారు.