Entertainment
సిద్దార్థ్, అదితీ పెళ్లి ఫోటోలు.. ఎంత ముచ్చటగా ఉన్నారో..

సిద్దార్థ్, అదితీ రావ్ హైదరీ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరూ పెళ్లి బట్టల్లో మెరిసిపోతోన్నారు. ఇక ఈ కొత్త జంట చూడముచ్చటగా ఉంది. సిద్దార్థ్ ఇంకా టీనేజ్ పిల్లాడిలానే ఉన్నాడంటూ పొగిడేస్తున్నారు.
సిద్దార్థ్, అదితీ రావ్ పెళ్లి మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండేది. ఎంగేజ్మెంట్ చాలా సైలెంట్‌గా చేసుకున్నారు. గద్వాల్‌లోని గుడిలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కూడా అక్కడే అని చెప్పుకొచ్చారు. కానీ ఈ పెళ్లిని కూడా చెప్పకుండానే చాలా సీక్రెట్‌గా చేసుకున్నట్టు అనిపిస్తుంది. బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్‌గా ఈ పెళ్లిని చేసుకున్నారనిపిస్తోంది.
ఆదివారం నాడే ఈ పెళ్లి వేడుకలు ముగిసినట్టుగా ఉన్నాయి. తాజాగా సిద్దు, అదితీ వదిలిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో సిద్దు మరింత చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.