Andhra Pradesh
సినిమా డైలాగులు నచ్చకపోతే సెన్సార్‌లో తొలగించండి: జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సినిమాల్లోని డైలాగుల వివాదంపై తీవ్రంగా స్పందించారు. “బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో దారుణమైన డైలాగులు ఉంటాయి. అలాంటివి నచ్చకపోతే, సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది?” అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఆ డైలాగులను పోస్టర్ల రూపంలో వినియోగించారని, దానికి కూటమి ప్రభుత్వం ఇద్దరిని రిమాండ్‌కు పంపించిందని ఆరోపించారు.
“ఫేమస్ పాటలు, డైలాగులు బయట అనుకరించడం తప్పా? అలాంటప్పుడు సినిమాలే ఆపేయాలి!” అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డులోనే సమస్య ఉంటే, విషయాన్ని అక్కడే పరిష్కరించాలేనని, ప్రజలపై వేధింపులు అన్యాయమని ఆయన స్పష్టం చేశారు