Latest Updates
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి యూరియా సరఫరా కోటా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి, ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరియా కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం స్పందిస్తూ రాష్ట్రానికి యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
“తెలంగాణలో యూరియా కొరత రాకుండా ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశాం. అన్ని జిల్లాలకు సమృద్ధిగా యూరియాను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అయితే, యూరియాను సమతుల్యంగా వినియోగించాలి. ఎక్కువగా వాడితే భూసారం దెబ్బతింటుంది,” అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో ఖరీఫ్ సాగు ప్రారంభ దశలో ఉన్న రైతులకు ఊరట కలిగింది. ముఖ్యంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్న తరుణంలో ఎరువుల అవసరం అధికంగా ఉండటంతో కేంద్రం నుంచి వచ్చిన హామీ రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది.