Andhra Pradesh
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్లో ఉత్పన్నమైన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 48,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలానికి చేరుతోంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి ఔట్‌ఫ్లో లేదు.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 99 టీఎంసుల నీరు నిల్వగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 857 అడుగుల వద్ద ఉంది. వర్షాలు కొనసాగితే ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు