International
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఇజ్రాయెల్‌లోని మనోళ్లు భద్రమేనా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తెలంగాణవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట బహిరంగంగా బయటకు రావడమే కాదు, నిద్రపోవడం కూడా కష్టమైందని, బంకర్లలో ఉంటేనే కొంత భద్రతగా ఉంటుందని అక్కడి నివాసితుడు సారంగధర్ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 4,000 నుండి 5,000 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరిలో ఉపాధి కోసం వెళ్లిన జగిత్యాల జిల్లా వ్యక్తి రవీందర్, క్షిపణుల శబ్దానికి భయపడి గుండెపోటుతో మృతిచెందిన విషాదం చోటు చేసుకుంది. యుద్ధ పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండాలన్న ఆందోళనతో వారి బంధువులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.