Latest Updates
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరూ తప్పించుకోలేరు: ఈటల రాజేందర్
తెలంగాణలో phone tapping కేసుపై రాజకీయ వాదనలు చెలరేగుతున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా గంభీరమైన అంశం. ఇది రాజ్యాంగానికి, వ్యక్తిగత హక్కులకు, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు విరుద్ధం. చేతిలో అధికారం ఉందని ఉద్ధటంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు,” అని ఆయన విమర్శించారు.
ఈటల మాట్లాడుతూ, ఈ కేసులో ఎంతటి వారైనా తప్పించుకోవడం సాధ్యపడదని స్పష్టం చేశారు. “దోషులు ఎవరో స్పష్టంగా తేలాలి. వారు శిక్షించబడాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది,” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులపై విచారణ కొనసాగుతోంది.