Latest Updates
ఈ ఫొటో నాకు ఎప్పటికీ ప్రత్యేకమే: సీఎం రేవంత్
రైతులపట్ల తన గౌరవాన్ని మరోసారి చాటిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జయశంకర్ అగ్రి వర్సిటీలో జరిగిన రైతునేస్తం సభలో వృద్ధ రైతు దంపతులతో దిగిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
“వయసు మీదైనా అలసిపోని సేద్యపు సైనికులు ఈ పెద్దయ్య, పెద్దవ్వ. నేటి తరం రైతులకు ఆదర్శంగా నిలిచే ఈ దంపతులతో దిగిన ఫొటో నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా ఉంటుంది” అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రైతు భరోసా నిధుల విడుదల చేసి, రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.