Latest Updates
గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్లకు వెల్లువ: విద్యార్థుల ఉత్సాహం పెరిగిందని కూకట్పల్లి ప్రిన్సిపల్
ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభంతో కూకట్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే భారీగా అడ్మిషన్లు పూర్తి కావడంతో, మరికొందరు ప్రాసెస్ కోసం వేచి చూస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులూ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్ధులకు అందుతున్న నాణ్యమైన బోధన, ఉచిత స్టడీ మెటీరియల్, మరియు ప్రభుత్వ స్కాలర్షిప్లు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల అవగాహన పెరుగుతోందన్నది ఈ వృద్ధి స్పష్టంగా చూపుతోందన్నారు