Entertainment
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూత
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ ఆకస్మిక సంఘటన టాలీవుడ్‌లో షాక్‌కు గురిచేసింది.
రవికుమార్ చౌదరి తన సినీ ప్రస్థానాన్ని ‘యజ్ఞం’ చిత్రంతో దర్శకుడిగా ప్రారంభించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘వీరభద్ర’, ‘ఆటాడిస్తా’, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘తిరగబడర సామి’ వంటి చిత్రాలను రూపొందించారు. తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన రవికుమార్, టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
రవికుమార్ చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. రవికుమార్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుందాం.