Entertainment
57 ఏళ్ల వయస్సులో తండ్రి కానున్న టాలీవుడ్ నటుడు
టాలీవుడ్లో ‘జై చిరంజీవ’, ‘శివం భజే’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అర్బాజ్, నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. 2023లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను వివాహం చేసుకున్న అర్బాజ్, తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇటీవల కొన్ని నెలలుగా షురా ఖాన్ గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె బేబీ బంప్ ఫొటోలతో ఈ విషయం మరింత స్పష్టమైంది. అర్బాజ్ ఖాన్ రెండో వివాహం తర్వాత తండ్రి కాబోతున్న విషయం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ శుభవార్తతో అర్బాజ్ ఖాన్ దంపతుల జీవితంలో సంతోషం నిండిపోతోంది.