Tech
ISRO: SSLV-D3 Mission Success

మరోసారి అంతరిక్షంలో ISRO తన కీర్తి ని ప్రదర్శించింది. ఈరోజు ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. విజయవంతంగా నింగిలోకి EOS-8 దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్.. SHAR నుంచి EOS-8 అంటే Earth Observation Sattelite-8 నింగిలోకి చేరింది. ఇస్రో రూపొందించిన ఈ చిన్నపాటి ఉపగ్రహ Vehicle Ship.. SSLV-D3 ద్వారా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అయితే ఈ ప్రయోగం శుక్రవారం ఉదయం జరిగింది. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ SSLV-D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కి.మీ ఎత్తున శాటిలైట్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా దీనిని డిజైన్ చేశారు. EOS-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్‌లో మూడు పే లోడ్స్‌ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్‌ను రూపొందించారు.
ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు తో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తోన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. గతేడాది చంద్రయాన్-3, సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్-1లను ప్రయోగించిన ఇస్రో.. వరుస మిషన్ల చేపట్టిన విషయం మనకు తెలిసిందే. 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న Circular కక్ష్యలోకి ప్రవేశపెటినట్టు ఇస్రో ప్రకటించింది.
EOS-08 ఉపగ్రహ మిషన్ ప్రధాన లక్ష్యాలు మైక్రో-శాటిలైట్‌ను రూపొందించడం, అలానే అభివృద్ధి చేయడం. మైక్రో- శాటిలైట్‌కు అనుకూలంగా ఉండే carrier ship పేలోడ్ సెన్సార్లను సృష్టించడం, భవిష్యత్తులో ఉపగ్రహా కార్యకలాపాలకు అవసరమైన కొత్త సాంకేతికతలను పొందుపరచడం చేస్తుంది. ఇస్రోకు చెందిన UR RAO శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహంలోని ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ (EOIR), పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా-రెడ్లు భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి.
ఇవి తీసిన ఫోటోలను విశ్లేషించి, వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అంతేకాదు, ఇది SSLV ప్రాజెక్ట్‌కు అవకాశాలను తీసుకొస్తుందని, సరికొత్త మిషన్లకు శ్రీకారం చుడుతుందని ఇస్రో చెప్పింది.
చెప్పాలంటే PSLV ప్రయోగాలకు సమయం, అలానే ఖర్చు కూడా ఎక్కువే. కానీ, SSLV చాలా ప్రత్యేకమైనది. తక్కువ ఖర్చు, సమయం, Limited human resources సాయంతో కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఇది ఇస్రో commercial ప్రయోగాలను మరింత రెట్టింపు చేయగలదని భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష commercial లో భారత్ వాటా పెరుగుదలకు Contribute చేస్తోంది.
అయితే, 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV ప్రయోగం ఫెయిల్ అయింది. దీంతో లోపాలను సరిచేసిన ఇస్రో.. గతేడాది మరో ప్రయోగం నిర్వహించి విజయవంతమైంది. దీంతో తాజా ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు, ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం VIP బ్రేక్ సమయంలో ఉపగ్రహం నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దింతో.. ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. ఇది మన అందరం గర్వించే రోజు..
Hats off to ISRO..
అలానే ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్ తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో గగన్ యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది అన్న విషయం మనకి తెలిసిందే. ఇందులో భాగంగా already అంతరిక్షానికి వెళ్లే నలుగురు Astronauts ని ఇస్రో ఎంపిక చేసేసింది. గగన్ యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు Astronauts లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లు ఇస్రో వెల్లడించిన విషయం మనకు తెలుసు. ఈ గగన్‌యాన్ మిషన్ ద్వారా Astronauts లను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్‌తో వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.
