Andhra Pradesh
తిరుపతిలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్: జూన్ 8న తారకరామ స్టేడియంలో వేడుక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకునేందుకు జూన్ 5వ తేదీ నుంచి స్టేడియంను అనుమతించాలని చిత్ర యూనిట్ యూనివర్సిటీ అధికారులను కోరింది.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ మరియు జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది. తిరుపతిలో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.