Latest Updates
హైదరాబాద్‌లో బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ప్రజల ధర్నా
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో బీజేపీ కార్పొరేటర్ బండారి శ్రీవాణి నివాసం ముందు స్థానిక బాలకృష్ణనగర్ కాలనీ వాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు. తమ కాలనీకి సంబంధించిన పైప్‌లైన్ పనులను నిలిపివేశారని, ఇతర కాలనీలలో పనులు చేపట్టేలా కార్పొరేటర్ మున్సిపాలిటీకి లేఖ రాశారని స్థానికులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను శాంతింపజేసేందుకు నచ్చజెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.