Latest Updates
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక: మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలు
భారతీయ రైల్వే శాఖ మే 1, 2025 నుంచి కొత్త నియమాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త రూల్ ప్రకారం, వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు. స్లీపర్ క్లాస్లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.250, ఏసీ క్లాస్లో ప్రయాణిస్తే రూ.440 జరిమానాగా వసూలు చేయబడుతుంది. అంతేకాకుండా, బోర్డింగ్ పాయింట్ నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నియమం ప్రకారం, టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు ఇక నుంచి జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు రైలు ప్రయాణంలో క్రమశిక్షణను పాటించేలా చేయడంతో పాటు, కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కాబట్టి, రైలు ప్రయాణికులు ఈ కొత్త నియమాలను గమనించి, తమ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలని రైల్వే శాఖ సూచిస్తోంది. జరిమానా మరియు అసౌకర్యాలను నివారించేందుకు, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరుతోంది.