Connect with us

Business

నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్..

నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్..

గడిచిన వారం రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం.

నవంబర్ నెల మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ.. రికార్డు స్థాయిలో నేలచూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగింది. PTI వార్తా సంస్థ ప్రకారం, MCXలో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 621 లేదా 0.84 శాతం పెరిగి రూ. 74,567కి చేరుకున్నాయి.

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల క్షీణత తర్వాత సోమవారం బంగారం ధరలో పెరుగుదల నమోదైంది. దేశీయంగా గోల్డ్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.660 వరకు పెరిగింది. ప్రస్తుతం అంటే నవంబర్‌ 18న రాత్రి 7 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.69,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,050ఉంది. గురువారం నాడు ఈ విలువైన మెటల్ 10 గ్రాములకు రూ.77,050 వద్ద ముగిసింది. వెండి కూడా కిలోకు రూ.1,810 పెరిగి రూ.92,000కి చేరుకోగా, గురువారం కిలో ధర రూ.90,190 వద్ద ముగిసింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,01,000 ఉంటే కొన్ని ప్రాంతాల్లో రూ.99,000 ఉంది.

వార్తా సంస్థ PTI ప్రకారం, MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టులు రూ. 621 లేదా 0.84 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.74,567 వద్ద ట్రేడయ్యాయి. ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల విలువైన మెటల్ రూ.732 లేదా 0.99 శాతం పెరిగి రూ.74,678కి చేరుకుంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా బంగారంలో బలమైన పెరుగుదల ఉందని ఎల్‌కెపి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విపి రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అన్నారు.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ కోసం వెండి ధర కిలోకు రూ. 879 లేదా 0.99 శాతం పెరిగి రూ. 89,300కి చేరింది. ఆసియా ట్రేడింగ్ సమయాల్లో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $25.20 లేదా 0.98 శాతం పెరిగి $2,595.30 వద్ద ఉన్నాయి. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపినట్లు, గత వారం బంగారం, వెండి ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రెండు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత బిట్‌కాయిన్, యూఎస్ డాలర్ బలంగా ఉండటం వల్ల ఈ తగ్గుదల జరిగింది.

Loading