Connect with us

Telangana

హైదరాబాద్‌లో అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్! ట్రంప్ గేమ్ షో షురూ.. 

హైదరాబాద్‌లో అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్! ట్రంప్ గేమ్ షో షురూ.. 

అగ్రరాజ్యం అమెరికా వెళ్లేందుకు వీసా తప్పనిసరి. అయితే, ఈ వీసాల కోసం దరఖాస్తు చేసే భారతీయులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం ఏడాదికిపైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకుంది. దేశంలో మొత్తం ఐదు నగరాల్లో అమెరికా కాన్సులెట్స్ ఉండగా వెయింటింగ్ టైం అటు ఇటుగా 430 రోజుల పైబడే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడం వీసాలు ఇక పొందడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అక్రమ వలసలను నియంత్రిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. 

ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం పొందడం అనేది చాలా మంది యువత కల. ఆ దేశానికి వెళ్లాలంటే వీసా అవసరం. కానీ, ఈ వీసా పొందడం ఆషామాషీ కాదు. దీని కోసం పడిగాపులు కాయాల్సిందే. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్లలో వీసా ప్రాసెస్ చేసేందుకు సమయం ఎక్కువైంది. B1/B2 వీసాల కోసం కోల్‌కతాలో 500 రోజులు ఎదురు చూడాలి, ఆ తర్వాత చెన్నైలో 486 రోజులు, హైదరాబాద్‌లో 435 రోజులు, ఢిల్లీలో 432 రోజులు వేచి ఉండాలి. తక్కువగా ముంబయిలో 427 రోజులు ఉంటుంది.  వీసా ప్రక్రియలో భారీగా కొనసాగుతున్న జాప్యం దరఖాస్తుదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 

తర్వితగతిన ప్రాసెసింగ్ పూర్తిచేసి.. దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తున్నప్పటికీ నిరీక్షణ సమయం మాత్రం తగ్గడం లేదు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకారం.. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం అంచనా వేసిన నిరీక్షణ.. పనిభారం, సిబ్బంది వ్యత్యాసాల ఆధారంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది.
B1 వీసా వ్యాపార సంబంధ పనుల కోసం, B2 వీసా పర్యటన, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను కలవడం, వైద్య చికిత్స లేదా సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా B1, B2 వీసాలు కలిసి జారీ చేస్తారు. ఈ వీసా పొందిన వ్యక్తులు అమెరికాలో ఉన్నప్పుడు వ్యాపార, వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత ఏడాది భారత్‌లోని యూఎస్ కాన్సులేట్ బృందం 1.4 మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. దీని వల్ల విజిటర్ వీసా అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షణ సమయం 75% తగ్గింది. దీంతో వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఉపశమనం కలిగింది. 

అమెరికా వీసాల కోసం అన్ని వర్గాలలో డిమాండ్ పెరిగింది. మునుపటి ఏడాదితో పోల్చితే దరఖాస్తుల సంఖ్య 60% పెరిగింది. విజిటింగ్ వీసా ఇంటర్వ్యూ మినహాయింపు కోరుకునే దరఖాస్తుదారుల డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీలో ఈ కేటగిరీ వీసాలకు నిరీక్షణ సమయం 14 రోజులు, కోల్‌కతాలో 13 రోజులు ఉంది. వీసా అపాయింట్‌మెంట్ లభ్యతను వచ్చే ఏడాది అదనంగా ఒక మిలియన్ స్లాట్‌లకు పెంచే ప్రణాళికలను కొద్ది రోజుల కిందట అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ ప్రకటించారు. 2026లో FIFA ప్రపంచ కప్, 2028లో ఒలింపిక్స్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌లకు సిద్ధమవుతోన్న అమెరికా.. పెరుగుతున్న వీసా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వీసా అపాయింట్‌మెంట్ నిరీక్షణ సమయం పెరుగుదల చూస్తుంటే.. ట్రంప్ గేమ్ మొదలైందనే భావన వ్యక్తమవుతోంది. అమెరికాలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన గెలుపులో ఈ అంశం కీలక పాత్ర పోషించింది. 

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *