Connect with us

Telangana

పట్టాలు తప్పిన ట్రైన్ సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం..

పట్టాలు తప్పిన ట్రైన్ సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం..

దేశంలో మరో ఘోర ట్రైన్ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి శాలీమార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని ప్రయాణికులను స్టేషన్‌కు తరలించారు.

సికింద్రాబాద్‌-శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు అని సౌత్‌-ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన వాటిలో రెండు ప్రయాణికుల బోగీలు, ఒకటి పార్సిల్‌ వ్యాన్‌ అని వారు చెప్పారు.

ఈ ప్రమాదంపై సౌత్ ఈస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓం ప్రకాష్ చరణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ దగ్గర ఈ రోజు ఉదయం 5:31 గంటల సమయంలో సికింద్రాబాద్-శాలీమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్టు తెలిపారు.

‘మధ్య లైన్ నుంచి డౌన్ లైన్‌కి మారుతున్నప్పుడు ఒక పార్శిల్ వాన్, రెండు ప్రయాణికుల బోగీలు పట్టాలు తప్పాయి.’ ఈ ఘటనలో ఎవరికి తీవ్ర గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. ప్రయాణికులకు అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను చేరవేసేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశాం.’ అని చరణ్ వెల్లడించారు.

రైల్వే ట్రాక్‌ ను మళ్లీ చక్కదిద్దే పనిలో రైల్వే సిబ్బంది ఉన్నారని చరణ్ చెప్పారు. వీలైనంత త్వరగా ట్రాక్‌లను క్లియర్ చేసి సాధారణ రైలు సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. దాంతో పాటుగా పట్టాలు తప్పటానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు రావాల్సి ఉంది. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డోర్నకల్ రైల్వే జంక్షన్ దగ్గర ఖమ్మం-భద్రాచలం బైపాస్‌లో శుక్రవారం రాత్రి (నవంబర్ 8) గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీనితో బోగీలు చెల్లాచెదురయ్యాయి.

కొన్ని బోగీలు పట్టాల నుండి పక్కకు ఒరిగిపోయాయి. ప్రమాదానికి గురైన గూడ్స్ ట్రైన్ రైలు బొగ్గు లోడు కోసం భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిన అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు వేగవంతం చేశారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తీశారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఈ రూట్‎లో ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏమిటో రైల్వే అధికారులు తెలుసుకుంటున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *