Connect with us

Andhra Pradesh

మంత్రి లోకేష్ అమెరికా పర్యటన.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో చర్చలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్‌ గవర్నెన్స్‌కు సాంకేతికంగా సహకారం అందించాలని.. అమరావతిని ఏఐ కేపిటెల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని నారా లోకేష్ కోరారు. ఒకసారి ఏపీకి రావాలని సత్య నాదెళ్లకు లోకేష్ ఆహ్వానంపలికారు. ఇక సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌తో పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ రంగాల్లో గ్లోబల్‌ లీడర్‌గా ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌కు మైక్రోసాఫ్ట్ మార్కెట్ 3.1 ట్రిలియన్‌ డాలర్ల‌గా ఉందని చెప్పారు.. 2023లో మైక్రోసాఫ్ట్‌ 211.9 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఉందన్నారు.

ఏపీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా మార్చేందుకు ముఖ్మయంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులు ఏర్పాటు చస్తున్నామని.. ఐటీ హబ్‌లను ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చదిద్దడంలో మైక్రోసాఫ్ట్‌ సహకారం అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రధానంగా క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా సెంటర్ల ఏర్పాటుతో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అనుకూల విధానాలతో పాటుగా భూమి కూడా ఉందని.. క్లౌడ్‌ సేవల్లో మైక్రోసాఫ్ట్‌ నాయకత్వంతో కలిసి ముందుకుసాగుతామన్నారు. పర్యావరణ వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక నిర్మించాలని భావిస్తున్నామని.. అగ్రిటెక్‌కు ఏఐ అనుసంధానంతో రాష్ట్ర సాగురంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వ్యాఖ్యానించారు.

స్ట్రీమ్‌లైన్డ్‌ అప్రూవల్స్‌, ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ పాలసీలతో సత్వర సేవలు అందుతాయన్నారు లోకేష్. వాణిజ్య, వ్యాపార రంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డిజిటల్‌ గవర్నెన్స్‌‌కు సంబంధించి తమ విధానాలకు మైక్రోసాఫ్ట్‌ సహకారం కోరుతున్నామన్నారు. అమరావతిని ఏఐ కేపిటల్‌గా తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈమేరకు ఏపీతో కలిసి పనిచేయాలని సత్య నాదెళ్లను కోరారు. ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట మాట ఇచ్చారని మంత్రి లోకేష్ అన్నారు.

ఇక మరోవైపు మంత్రి లోకేష్ సోమవారం EV రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ అయినా టెస్లాను ఆహ్వానించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్‌(EV) పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఆస్టిన్‌‌లోని టెస్లా కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈవీల తయారీ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా సీఎఫ్‌వో వైభవ్‌ తనేజా ను కలిశారు. టెస్లా తన యూనిట్‌ను ఏపీలో స్థాపించే అవకాశాలపై ప్రధానంగా మాట్లాడుకున్నారు.

Loading