Connect with us

Entertainment

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాజాసాబ్’ నుంచి మోషన్ పోస్టర్.. లుక్ అదిరిందిగా..

మన పాన్ ఇండియా స్టార్.. రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘ది రాజాసాబ్’ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ చూసి మురిసిపోయిన ఫ్యాన్స్‌ను తాజాగా వదిలిన మోషన్ పోస్టర్‌తో భయపెట్టాడు డైరెక్టర్ మారుతీ. రెండు నిమిషాల సమయం గల ఈ వీడియోలో ప్రభాస్‌ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

తాజాగా వదిలిన మోషన్ పోస్టర్‌లో బీజీఎం మాములుగా లేదు. ఏదో హాలీవుడ్ హార్రర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కొన్ని చెట్ల మధ్యలో ఉన్న ఓ కోట లాంటి ఇల్లు.. అందులో సింహాసనంపై రాజసంగా కూర్చున్న ప్రభాస్ పోస్టర్ మాత్రం అదిరింది. అయితే మొన్న వదిలిన గ్లింప్స్‌లో లుక్‌కి ఇందులో లుక్‌కి అసలు ఏమాత్రం సంబంధమే లేదు. మొత్తానికి మారుతీ అయితే ఫ్యాన్స్‌ను భయపెట్టాడు.

నోట్లో చుట్ట, మెడ నిండా పూసల దండలతో.. గ్రే హెయిర్‌తో కనిపించారు ప్రభాస్. ఇది చూస్తుంటే రాజాసాబ్‌లో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక మోషన్ పోస్టర్ చివరిలో హార్రర్ ఈజ్ ది న్యూ హ్యూమర్ అంటూ వేశారు. దీన్ని భట్టి ఈసారి భయపెడుతూ మారుతీ నవ్వించబోతున్నట్లు తెలుస్తోంది.

2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు మారుతీతో ప్రభాస్ చేయడమేంటి అంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. ఎందుకంటే బాహుబలి 2తో తర్వాత ప్రభాస్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. అలాంటి హీరో.. చిన్న డైరెక్టర్ మారుతీతో సినిమా చేయడమేంటని అంతా అనుకున్నారు. కానీ మారుతీపై నమ్మకం ఉంచి ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

ఇక తాజాగా రిలీజైన గ్లింప్స్‌తో ఫ్యాన్స్ కు ఉన్న అనుమనాలను పటాపంచలు చేశాడు డైరెక్టర్ మారుతీ. ఎందుకంటే ఇందులో ప్రభాస్ లుక్ చూసి మిర్చి తర్వాత అంతటి క్లాస్ లుక్‌లో ప్రభాస్‌ను మళ్లీ ఇప్పుడే చూస్తున్నామంటూ ఫ్యాన్స్ పొంగిపోయారు. పైగా హర్రర్ చిత్రంలో ప్రభాస్ ఇప్పటివరకూ నటించలేదు. దీంతో ప్రభాస్ కామెడీ టైమింగ్‌ను మారుతీ ఖచ్చితంగా ఉపయోగించుకొని ఓ మంచి ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇందుకు తగ్గట్లే మొన్న గ్లింప్స్‌తో ఇప్పుడు మోషన్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాడు మారుతీ. మరి టీజర్ ఎప్పుడొస్తుందే తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Loading