Entertainment
సొంత సినిమాను కాకుండా.. అందుకే ప్రభాస్ గొప్పవాడు..

డార్లింగ్ ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో వివాదరహితుడు. అజాతశత్రువు. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా నవ్వుతూ వదిలేస్తాడు తప్పా.. తిరిగి విమర్శించడు. నెగెటివిటీని కిలోమీటర్ల దూరంలోనే ఉంచుతాడు. అభిమానుల కడుపు నింపాలని చూస్తుంటాడు. సెట్లో అందరికీ రుచికరమైన భోజనం పెట్టి ఆత్మారాముడ్ని సంతోషపరుస్తాడు.
ప్రభాస్ తన సొంత సినిమాల కంటే చిన్న సినిమాలు, ఇతర చిత్రాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాడు. ప్రభాస్ తన ఇన్‌స్టా, ఫేస్బుక్ ద్వారా చిన్న చిత్రాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల లవ్ రెడ్డి అనే చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. తన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చినా.. దాని గురించి పట్టించుకోకుండా.. వేరే ఇతర సినిమాకు సంబంధించిన అప్డేట్ను పోస్ట్ చేశాడు. ప్రశాంత్ నీల్ కథ అందించిన భఘీరా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రభాస్ పొగుడుతూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అదే సమయంలో నిన్న రాజా సాబ్ నుంచి పోస్టర్ కూడా విడుదలైంది.
కానీ దాని గురించి ప్రభాస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయలేదు. ఇతర హీరోలు తమ సినిమాల అప్డేట్లను తమ ఖాతాల్లో ప్రమోట్ చేస్తారు, కానీ ప్రభాస్ తన సొంత సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాను ప్రమోట్ చేశాడు.ఇతర హీరోలు తమ సినిమాల అప్డేట్లను తమ ఖాతాల్లో ప్రమోట్ చేస్తారు, కానీ ప్రభాస్ తన సొంత సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాను ప్రమోట్ చేశాడు. అందుకే ప్రభాస్ గ్రేట్.
ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్‌తో సందడి చేస్తున్నాడు. ఆ తరువాత హను రాఘవపూడి ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత కల్కి 2, సలార్ 2, స్పిరిట్ ఇలా అన్నీ వరుసగా ఉన్నాయి. ఈ ఏడాది కల్కి 2898 ఏడీతో ప్రభాస్ వెయ్యి కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్‌ను వణికించాడు. బాహుబలి 2 తర్వాత మళ్లీ వెయ్యి కోట్లు సాధించి తన స్థాయిని నిరూపించాడు.