Entertainment
జానీ మాస్టర్ గురించి ప్రెస్ మీట్ పెట్టిన యానీ మాస్టర్..

జానీ మాస్టర్ ఇష్యూ మీద లేడీ కొరియోగ్రాఫర్ యానీ స్పందించింది. మా యూనియన్‌లో ఎన్నో సమస్యలుంటాయని, కానీ ఇలాంటి ఇష్యూ రావడం బాధాకరం అని చెప్పుకొచ్చింది. మా యూనియన్‌లో 500 మంది డ్యాన్సర్లు మరియు 150 మందికి పైగా కొరియోగ్రాఫర్లు ఉన్నారు అని తెలిపింది. అందరికీ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలుంటాయి. ఫించన్, హెల్త్ కార్డులు అంటూ అందరికీ వీలైనంతగా సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటాని చెప్పుకొచ్చింది.
ఇంత వరకు జానీ మాస్టర్ ఇష్యూలో ఎవ్వరూ ముందుకు రాలేదు. అమ్మాయి విషయం కాబట్టి ఎవ్వరూ ముందుకు వచ్చి మాట్లాడలేదు. నేను జానీ మాస్టర్ వద్ద పని చేశాను. ఆయన నాకు గురువులాంటి వ్యక్తి. ఆయన గురించి నాకు తెలుసు. నేను ఆయన వద్ద ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదు. ఆ బాధితురాలు సెట్లో జానీ మాస్టర్‌తో బాగుగా కలుస్తూంది మరియు సంతోషంగా ఉంటూంది.
ఆరు నెలల క్రితమే ఇంటర్వ్యూల్లో జానీ మాస్టర్ చాలా గొప్పవాడు అని చెప్పింది.. మరి ఇంతలో ఏం జరిగిందో తెలియడం లేదు.. ఇలా జరిగింది.. ఆమె చేసిన ఆరోపణలు నిజం అవునో కాదో తెలియడం లేదు.. అలా అని నేను జానీ మాస్టర్‌ను సపోర్ట్ చేయడం లేదు. ఒక వేళ ఆమె చేసిన ఆరోపణలు నిజం అయితే, నేను ఆమెనే సపోర్ట్ చేస్తాను అని యానీ మాస్టర్ చెప్పింది. జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం, అరెస్ట్ కావడం చాలా బాధగా ఉందని, అలా అని ఆయన్ను సపోర్ట్ చేస్తున్నానని కాదు అని తెలిపింది.
యూనియన్‌లో ఎవరికి ఏ సమస్య వచ్చినా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లే ముందుకు వచ్చి సాయం చేస్తుంటారని యానీ చెప్పుకొచ్చింది. డ్యాన్సర్లకు ఏ ఆపద వచ్చినా చిన్న చిన్న ఆర్థిక సాయం చేస్తుంటారు కానీ ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరూ ఎక్కడా చెప్పరు.. ఈ విషయాన్ని మాత్రం ఇంతగా నెగెటివ్ ఎందుకు చేస్తున్నారు అంటూ యానీ మాస్టర్ వాపోయింది. జానీ మాస్టర్ ఇష్యూతో తమ డ్యాన్సర్ అసోషియేషన్ మీద ఇంతలా నెగిటివిటీ ఎందుకు చూపిస్తున్నారంటూ యానీ మాస్టర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది.