Connect with us

Andhra Pradesh

రికార్డ్ బ్రేక్ ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది.

రికార్డ్ బ్రేక్ ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి.. అమ్మవారిని దర్శించుకునేందుకు చివరి రెండు రోజులు భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గమ్మ దర్శనానికి శుక్రవారం రోజు మాత్రం భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ఒక్క రోజు భారీగా ఆదాయం సమకూరింది  శుక్రవారం ఏకంగా రూ.84లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. దర్శన టికెట్లు, సేవల టికెట్లు, లడ్డూల విక్రయం, కలిపి ఈ ఆదాయం వచ్చింది.

దసరా ఉత్సవాలు ముగిసీనా  తారువత దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. శుక్రవారం రోజు  రూ.500 టికెట్లు 4,149 మంది భక్తులు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది.

నెల్లూరుకు చెందిన వ్యాపారవేత్త పంకజ్‌రెడ్డి, సరిత దంపతులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా అందజేశారు. కుంకుమార్చనకు రూ.54వేలు వచ్చాయి. రూ.3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేశారు.. చండీహోమానికి రూ.4వేల టికెట్లను ఏడుగురు కొనుగోలు చేయగా రూ.28వేలు.. దీంతో పాటూ శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు కొనుగోలు చేయగా రూ.6వేలు ఆదాయం సమకూరింది.

గాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ దుర్గమ్మను దర్శించుకున్నారు. నటుడు 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు  దాతలకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

విజయదశమి రోజున శనివారం  విజయవాడ దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ లక్ష మందికిపైగా భక్తులు దర్శనానికి వచ్చారు. శనివారం నుంచి భవానీ భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం వేళ కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించారు.

 

 

 

 

 

 

Loading