Entertainment
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ అప్డేట్.. 2nd షెడ్యూల్ Start..

ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాబోతున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ఇటీవలే ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో మూవీ పట్టాలెక్కింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అలానే రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. ఇందుకోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతుందట.
ఫౌజీ మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ లోనూ ప్రభాస్ పాల్గొనే అవకాశం లేదు. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు హనురాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి సమయం వృథా అవ్వకుండా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. సీతారామం వంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన హను రాఘవపూడి.. ఇప్పుడు వార్ నేపథ్యంలో సాగె ఒక మంచి ప్రేమ కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న హను రాఘవపూడి తో ప్రభాస్ మూవీ ఎలా ఉంటుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హను రాఘవపూడి ఈ చిత్రంలో ప్రభాస్ ను సోల్జర్ పాత్రలో చూపించబోతున్నారు. అయితే ప్రభాస్ నుంచి వచ్చిన బాహుబలి, సాహో, సలార్ సినిమాలు భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా రూపొందిన విషయం మనకి తెల్సిందే. అందుకే ఇప్పుడు ఈ ఫౌజీ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తన గత చిత్రాల మాదిరిగా రూపొందిస్తారని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో స్టార్డం దక్కాయి.
ఇక డిసెంబర్ నుంచి ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన రెండు పాటలను ఇప్పటికే రెడీ చేశారని, త్వరలోనే వాటికి సంబంధించిన అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. కనుక ఈ సినిమా సైతం మ్యూజికల్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక రాజా సాబ్ వచ్చిన కొన్ని నెలల లోపే ఫౌజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.