Connect with us

Andhra Pradesh

గల్ఫ్ యుద్ధ సెగ: ఏపీ ప్రభుత్వం హై అలర్ట్.. ఢిల్లీ ఏపీ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్!

#ఏపీ_ప్రభుత్వం #గల్ఫ్_తెలుగువారు #చంద్రబాబు_నాయుడు #ఇరాన్_ఇజ్రాయెల్_యుద్ధం #ఏపీ_కంట్రోల్_రూమ్ #అయ్యన్నపాత్రుడు #ఎన్ఆర్ఐ_అప్‌డేట్స్ #గల్ఫ్_వార్తలు #ఆంధ్రప్రదేశ్_న్యూస్ #ప్రవాసాంధ్రులు #బ్రేకింగ్_న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వేలాది మంది తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ క్రింది మార్గాల ద్వారా సహాయం పొందవచ్చు,APNRTS హెల్ప్‌లైన్: 0863-2340678,వాట్సాప్ నంబర్: +91 85000 2767

ఏపీ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బంది పడుతున్న వారికి APNRTS కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని తెలిపారు. భారత రాయబార కార్యాలయాలతో (Indian Embassy) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు,బహ్రెయిన్‌లో ఉన్న సుమారు 50 వేల మంది తెలుగువారి భద్రతపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్కడి ఎన్నారై ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతం నుంచి వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నందున, వారి యోగక్షేమాలపై ఆరా తీస్తూ ధైర్యం చెప్పారు,ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు అనవసర ప్రయాణాలు చేయవద్దని, స్థానిక ప్రభుత్వ సూచనలను పాటించాలని ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *