Agriculture
రాజమండ్రి మరణాలకు కారణం పాలా? లేక కలుషిత నీరా?: బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్న!
రాజమహేంద్రవరం పరిధిలో కల్తీ పాలు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కేవలం పాలని నిర్ధారించడం సరికాదు: వైద్య నివేదికలు రాకముందే ఇవి కేవలం పాల వల్ల జరిగిన మరణాలని ముగింపు పలకడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక జల, వాయు, భూగర్భ కాలుష్యం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
రాజమండ్రి వద్ద ఏపీ పేపర్ మిల్స్, మున్సిపాలిటీ వ్యర్థాలు, ఆంధ్రా షుగర్స్ విడుదల చేస్తున్న కాలుష్యం గోదావరిని విషతుల్యం చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు, డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలిని క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసేలా చూడాలని కోరారు, ఆసక్తికరంగా, ఈ విషాదం జరగడానికి రెండు రోజుల ముందే అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ గోదావరి కాలుష్యంపై బొలిశెట్టి ట్వీట్ చేయడం గమనార్హం,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పాలు సరఫరా చేసిన గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కేవలం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా, కాలుష్యాన్ని శాశ్వతంగా అరికట్టే ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని బొలిశెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]()
