Connect with us

Latest Updates

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం: ఒక్కరోజే 14 వేల కోట్ల సంపద ఆవిరి..

#ఐడీఎఫ్‌సీఫస్ట్బ్యాంక్ #బ్యాంకింగ్కుంభకోణం #స్టాక్మార్కెట్ #ఎల్‌ఐసీ #ఆర్థికవార్తలు #షేర్మార్కెట్నష్టం #పెట్టుబడిదారులు #బ్యాంక్ఫ్రాడ్ #భారతప్రభుత్వం #బిజినెస్అప్‌డేట్స్ #ఆర్బీఐ #హరియాణాన్యూస్

హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక ఖాతాలో సుమారు రూ. 590 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు బ్యాంక్ స్వయంగా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చండీగఢ్‌లోని బ్రాంచీలో ఉద్యోగులు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

 సోమవారం ట్రేడింగ్‌లో ఈ బ్యాంక్ షేరు ఏకంగా 20 శాతం నష్టపోయి రూ. 66.80 కనిష్ఠ స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 16 శాతం నష్టంతో రూ. 70.09 వద్ద స్థిరపడింది,కేవలం ఒకే రోజులో బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 14,000 కోట్లకు పైగా పడిపోయింది, ఈ బ్యాంకులో భారత ప్రభుత్వానికి 7.75 శాతం వాటా ఉంది. షేరు పతనం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 1,100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది, 2.35 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ (LIC) కి దాదాపు రూ. 338 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా,టాటా ఏఐఏ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వందల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

ఈ అక్రమ లావాదేవీలపై ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఇప్పటికే ఆర్‌బీఐ (RBI) కి సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంక్ అంతర్గత విచారణను కూడా ముమ్మరం చేసింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న ఐడీఎఫ్‌సీలో ఇలాంటి కుంభకోణం బయటపడటం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశమైంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *