Business
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్!
దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23న జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లో అస్థిరతను సృష్టించాయి. ఈ అనిశ్చితి సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు,భారత్లో పెళ్లిళ్లు, పండగల సీజన్లలో సహజంగానే ఉండే డిమాండ్ వల్ల కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం మరియు ఆర్బీఐ నిశితంగా దృష్టి సారించాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కరెంట్ ఖాతా లోటు (CAD) అదుపులోనే ఉందని, దిగుమతులు ఆందోళనకరంగా లేవని ఆమె భరోసా ఇచ్చారు. అమెరికా విధిస్తున్న కొత్త సుంకాల ప్రభావంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ త్వరలోనే స్పష్టత ఇస్తుందని చెప్పారు.అలాగే, హరియాణాలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల మోసంపై ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ, అది వ్యవస్థీకృత మోసం కాదని, దానిపై విచారణ జరుగుతోందని వెల్లడించారు.
![]()
