Connect with us

Latest Updates

ఇకపై వాట్సాప్‌లోనే విద్యుత్ ఫిర్యాదులు: TGSPDCL సరికొత్త చాట్‌బాట్!

#తెలంగాణవిద్యుత్ #వాట్సాప్‌చాట్‌బాట్ #కరెంట్కష్టాలు #విద్యుత్సేవలు #హైదరాబాద్న్యూస్ #సైబర్అలర్ట్ #కరెంట్బిల్లు #డిజిటల్తెలంగాణ #ప్రభుత్వసేవలు #తెలంగాణవార్తలు #సాంకేతికత #వినియోగదారులసమాచారం

కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగినా లేదా బిల్లులో తప్పులు దొర్లినా.. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మీ మొబైల్ నుంచే పరిష్కారం పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ఈ సేవలను వినియోగదారులు 24/7 ఉపయోగించుకోవచ్చు.

చాట్‌బాట్ సేవలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పొందడానికి ముందుగా మీ ఫోన్‌లో 87******12 నంబరును సేవ్ చేయండి.వాట్సాప్‌లో ఈ నంబరుకు ‘Hi’ అని మెసేజ్ పంపండి.సేవలు ఎంచుకోని ఫిర్యాదు నమోదు, బిల్లింగ్ వివరాలు, ప్రస్తుత సరఫరా స్థితి వంటి ఆప్షన్లను ఎంచుకుని సమాచారం పొందవచ్చు.

అలాగే “మీ కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉంది.. కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ వచ్చే నకిలీ కాల్స్ మరియు మెసేజ్‌ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అటువంటి అనుమానాస్పద సమయంలో ఈ చాట్‌బాట్ ద్వారా నేరుగా మీ బిల్లు వాస్తవ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.మరోవైపు, రామగుండం ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధర మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉండటంపై అధికారులు చర్చిస్తున్నారు. యూనిట్‌కు రూ.4.88 నుండి రూ.5.98 వరకు ఖర్చు అవుతుండటం డిస్కంలపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *