india news
క్యాబ్‌లోనే నిద్రపోతున్న పిల్లాడిని వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు.. అసలేం జరిగింది?
సిలికాన్ వ్యాలీ బెంగళూరులో అసలేం జరిగింది?
అలసటలో శనివారం రాత్రి ఒక కుటుంబం తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణంలో అలసిపోయిన 4 ఏళ్ల చిన్నారి కారు వెనుక సీట్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు,పిల్లాడు దిగాడనుకొని గమ్యస్థానం చేరాక సామాన్లు తీసుకున్న తల్లిదండ్రులు, బాబు దిగే ఉంటాడనే భ్రమలో లోపలికి వెళ్లిపోయారు. డ్రైవర్ కూడా వెనుక సీటును గమనించకుండా కారు తీసుకుని వెళ్ళిపోయాడు.ఇంటికి వెళ్ళాక బాబు కనిపించకపోవడంతో ఆ దంపతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాము క్యాబ్‌లోనే బాబును వదిలేశామని గ్రహించి వెంటనే ‘నమ్మ 112’ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు.
పోలీసుల చాకచక్యంతో,
సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు టెక్నాలజీ సాయంతో వెంటనే క్యాబ్ డ్రైవర్‌ను ట్రాక్ చేశారు. కారులో పిల్లాడు ఉన్నాడన్న విషయం డ్రైవర్‌కు కూడా అప్పటి వరకు తెలియదు. పోలీసుల ఆదేశంతో డ్రైవర్ కారును వెనక్కి తిప్పి, గంట వ్యవధిలోనే బాబును తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాడు. గండం గడిచి బిడ్డ కళ్ళముందు కనిపించడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
![]()
