Entertainment
8 వసంతాలు’ సినిమా కోసం దేశమంతా తిరిగి హీరోయిన్‌ను ఎంపిక చేసిన మైత్రీ మూవీ మేకర్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ‘8 వసంతాలు’ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దేశవ్యాప్తంగా వెతికినట్లు నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. దర్శకుడు ఫణీంద్ర ఆలోచన మేరకు క్లాసికల్ డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉన్న అనంతిక (MAD ఫేమ్)ను ఈ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సినిమా కోసం అనంతిక అంకితభావంతో, కఠోర శ్రమతో పనిచేశారని రవిశంకర్ ప్రశంసించారు.
17 నుంచి 25 ఏళ్ల వయస్సు మధ్యలో ఓ యువతి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, ఆమె ప్రయాణమే ఈ చిత్ర కథాంశమని నిర్మాత వివరించారు. ఈ సినిమా యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందించబడిందని, అనంతిక నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.